ఇంద్రవెల్లి, వెలుగు: అడవి పంది దాడిలో మహిళకు గాయలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దుబ్బగూడ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కోవా భీంబాయి, యేర్మ పారువాయి. ధనలక్ష్మీ వ్యవసాయ పనులకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన అడవి పంది భీంబాయిపై దాడి చేసింది. ఆమె మోకానికి గాయాలయ్యాయి. తోడుగా ఉన్న ఇద్దరు మహిళలు పరుగులు తీసి తప్పించుకున్నారు.
వెంటనే గ్రామస్తుల సాయంతో అంబులెన్స్ కు సమాచారం అందించి భీంబాయిని రిమ్స్ కు తరలించి చిక్సిత అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇంద్రవెల్లి అటవీ రేంజ్ అధికారి సంతోష్ .. భీంబాయి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అటవీ శాఖ తరుపున అదుకోవడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
