యువతి కిడ్నాప్ సమాచారంతో అర్థరాత్రి  పోలీసుల హైరానా

యువతి కిడ్నాప్ సమాచారంతో అర్థరాత్రి  పోలీసుల హైరానా

హైదరాబాద్: ఆరాం ఘర్ చౌరస్తా వద్ద ఓ మహిళను కిడ్నాప్ చేశారంటూ 100కు  సమాచారం రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. దీంతో.. శంషాబాద్ వెళ్తున్న ప్రతీ ఒక్క వెహికిల్ ను చెక్ చేశారు పోలీసులు. శుక్రవారం రాత్రి ఓ ఆటో డ్రైవర్ డయల్ 100కు కాల్ చేసి కొందరు వ్యక్తులు బలవంతంగా ఓమ్నీ వెహికిల్ లో ఓ మహిళను బలవంతంగా ఎక్కించుకుని తీసుకువెళ్లడాన్ని తాను చూశానని చెప్పాడు. అయితే ఆటో డ్రైవర్ చెప్పిన వెహికిల్ ను మైలార్దేవులపల్లి దగ్గర పోలీసులు పట్టుకుని అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించారు. ఆ వాహనంలో మహిళ ఎవరూ లేరని.. ఆటో డ్రైవర్ పొరపడి ఉంటారని చెప్పారు పోలీసులు.