
- కలకలం రేపిన ఘటన
గ్వాలియర్: ఓ యువతిని పట్ట పగలే ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లాకు చెందిన ఓ యువతి (19) బీఏ చదువుతోంది. బంధువుల వేడుకకు హాజరు కావడానికి కుటుంబంతో కలిసి ఆమె గ్వాలియర్ కు వచ్చింది. తన సోదరుడికి టాయిలెట్ రావడంతో సమీపంలోని పెట్రోల్ బంక్ కు తీసుకెళ్లింది.
అదే సమయంలో పెట్రోల్ బంక్ కు బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. పట్టణంలో కలకలం రేపిన ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.