అమ్మాయి ఒడిలో కొండచిలువ.. ఎంత కూల్గా..

అమ్మాయి ఒడిలో కొండచిలువ.. ఎంత కూల్గా..

పామును కాదు.. పాము పిల్లను చూసినా చెమటలు పడతాయి.. అమ్మో పావు అని పరుగులు.. అలాంటిది ఓ కొండ చిలువ మీ వైపు వస్తుంటే ఎలా ఉంటుంది.. ఉస్సేన్ బోల్ట్ కంటి వేగంగా పరిగెడతారు.. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా కూల్ గా.. సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ ఉంది. చిన్నగా వచ్చిన కొండ చిలువ ఆ అమ్మాయి ఒడిలో హాయిగా సేదతీరింది. వీడియో చూడటానికే వణికిపోతున్నట్లు ఉంది.. నెటిజన్లు మొత్తం ఆశ్చర్యపోవటం కాదు.. షాక్ అవుతున్నారు.. 

ఈ వీడియో ఎక్కడ తీసింది.. ఆ అమ్మాయి ఎవరు అనే విషయంలో స్పష్టత రాకపోయినా.. వావ్ టెర్రిఫైయింగ్ అనే అధికారిక ట్విట్టర్ నుంచి ఇది ఈ వీడియో పోస్ట్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు.. దిగ్బ్రాంతికి గురవుతున్నారు. అంత పెద్ద కొండ చిలువ తన వైపు వస్తుంటే ఆ అమ్మాయికి భయం వేయలేదు అంటే.. అది పెంపుడు పైతాన్ అయ్యి ఉంటుంది అని కొందరు అంటున్నారు. ఈ వీడియో చాలా క్లోజప్ లో ఉంది.. ఇది గ్రాఫిక్ అయ్యి ఉండొచ్చు .. ఇది క్రియేట్ చేసింది అయ్యి ఉండొచ్చు అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇది నిజంగా ఒరిజనల్ వీడియో అని.. ఆ కొండ చిలువను ఇంట్లో పెంచుకుంటూ ఉండొచ్చు అని.. కొన్ని దేశాల్లో ఇలాంటివి సహజం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏదిఏమైనా ఈ వీడియో మాత్రం వైరల్ అయ్యింది. చిన్న పాము పిల్లను చూస్తేనే భయంతో వణికిపోతాం.. అలాంటిది ఆ అమ్మాయి అంత పెద్ద కొండ చిలువ తన ఒడిలో ఉన్నా.. మింగేస్తుందనే భయం లేకుందా ఎంత కూల్ గా సెల్ ఫోన్ చూస్తూ ఉందంటే.. నిజంగా గట్స్ ఉండాలి అంటున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది చూడగా.. లక్షల సంఖ్యలో కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. ఇలాంటి డేంజరస్ జంతువులతో ఆటలు ఎప్పటికీ మంచివి కాదని.. ఇలాంటివి చూసి మరికొందరు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని.. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని మరికొందరు హితవు చెబుతున్నారు.