విడాకులు కావాలన్న భార్య.. కేసు పెట్టిన ప్రియురాలు

విడాకులు కావాలన్న భార్య.. కేసు పెట్టిన ప్రియురాలు

పూణే : భర్తను అడ్డంగా బుక్ చేద్దామనుకున్న భార్యకు ఊహించని షాక్ ఎదురైంది. కొన్ని నెలలుగా భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా కోర్టుకు చూపించి విడాకులు తీసుకోవాలనుకొంది భార్య. దీంతో భర్త ఉన్న బెడ్ రూమ్ లో సీసీ కెమెరా అమర్చింది. సరిగ్గా ప్రియురాలితో గడుపుతున్న దృశ్యాలను సేకరించింది. అయితే ఆమె ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది. తన ప్రైవసీకి భంగం కలిగించారంటూ ప్రియుడి భార్యపై ఫిర్యాదు చేసింది ప్రియురాలు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన పూణేలో జరిగింది.

వివరాలు : పూణేకు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కింది. అయిత భర్త చేసిన తప్పులను ఆధారాలతో సహా చూపిస్తేనే విడాకులు ఇస్తామని తెలిపింది కోర్టు. దీంతో భార్య సీసీ కెమెరా స్కెచ్ వేసి బుక్కయ్యింది. ఇదే విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. భారీ భరణం ఇచ్చి విడాకులు ఇవ్వాలని భార్య.. భర్తను డిమాండ్ చేసిందని భర్త ఆరోపిస్తున్నాడు.

అంతేకాదు.. భార్య తరుఫు లాయర్ కూడా ఆ వీడియో చూపించి ప్రియురాలిని డబ్బులు డిమాండ్ చేశాడని… లేకపోతే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడని ఆ లాయర్ మీద కంప్లైట్ ఫైల్ చేసింది. ప్రియుడి భార్య తన ప్రైవసీకి భంగం కలిగించిందని ఆమె పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్యను అరెస్ట్ చేసారు.