అసభ్యకర మెసేజ్లు చేస్తున్నాడని చెప్పుతో కొట్టింది

అసభ్యకర మెసేజ్లు చేస్తున్నాడని చెప్పుతో కొట్టింది

నడిరోడ్డుపై ఓ యువకుడిని మహిళ చెప్పుతో కొట్టింది. పక్కన వాళ్లు చెప్తున్నా వినకుండా పదే పదే కొడుతూ తన కాళ్లు పట్టించుకుంది. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ సంఘటన జరిగింది. ఏఎం బేకరీ టీ దుకాణంలో పనిచేసే కల్యాణ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో అసభ్య మెసేజ్ లు పంపించారని సదరు మహిళ ఆరోపించింది. కల్యాణ్ అడ్రస్ సేకరించిన మహిళ అక్కడికి చేరుకుని యువకుడిని చెప్పుతో చితకబాదింది.