
పెద్దపల్లి: పాలకుర్తి మండలం జీడీ నగర్ గ్రామ సర్పంచ్, VROలు కలిసి తన భూమిని గుంజుకున్నారని కలక్టరేట్ ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది ఓ మహిళ. మీడియాతో మాట్లాడిన ఆమె… తన పేరు కొలిపాక ఇందిర అని చెప్పింది. తాను వికలాంగురాలినని, తనకు 90 సంవత్సరాలుగల తల్లి ఉందని తెలిపింది. తనకు కన్నాల గ్రామంలో శివారు సర్వే నెంబరు… 561లో 0-39 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు చెప్పింది ఇందిర. అయితే బి.డి నగర్ గ్రామ సర్పంచ్ సూర సమ్మయ్య, VRO కోట వెంకటి అనే వీరు తన భూమిని కబ్జా చేసుకుని.. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పింది. తనకు బతుకుదెరువు కేవలం ఆ వ్యవసాయభూమేనని.. అందులోనే పత్తిని పండించుకుని జీవనం సాగిస్తున్నానని చెప్పింది. అయితే సర్పంచ్, VRO లు గుంజుకున్న భూమిని తిరిగి ఇప్పించాలని కోరింది. తన ప్రాణానికి కూడా రక్షణ లేదని జిల్లా కలెక్టర్ దయతలచి రక్షణ కల్పించాలని కోరింది.