
తాను ఇంటి ఆవరణలో ఉంటే, రోడ్డు మీదున్న కుక్క మీదికొచ్చి కరిచిందని ఓ మహిళ శుక్రవారం హైదరాబాద్ లోని బేగంపేట పీఎస్ లో ఫిర్యాదు చేసింది. గడ్డం మాలతీరెడ్డి (71) బేగంపేట బీఎస్ మక్తాలో ఉంటోంది. ఈనెల 28న రాత్రి 11:30 గంటల టైమ్ లో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. రోడ్డుపై ఉన్న కుక్క.. ఇంటి ఆవరణలోకి ఉరికొచ్చి ఆమెపై దాడి చేసింది. దీంతో కిందపడిపోగా, గాయాలయ్యాయని మాలతీరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. సమీపంలోని జయా గార్డెన్ మేనేజ్ మెంట్ కు చాలా కుక్కలు ఉన్నాయని, వాళ్ల కుక్కనే తనపై దాడి చేసిందని ఆమె ఆరోపించారు. ఐపీసీ 289, 337 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.