వీడియో: మాస్క్ పెట్టుకోలేదని మహిళను చితకబాదిన..

వీడియో: మాస్క్ పెట్టుకోలేదని మహిళను చితకబాదిన..

మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. మాస్కు ధరించలేదన్న కారణంతో ఓ మహిళను నడిరోడ్డుపై తీవ్రంగా కొట్టారు. నిత్యావసరాలు కొనడానికి తన కూతురితో కలిసి బయటకు వచ్చిన  మహిళ మాస్కు ధరించలేదు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిందంటూ పోలీసులు ఆమెను తీవ్రంగా కొట్టారు. జుట్టు పట్టుకొని లాగి.. కాలుతో తన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ ప్రయత్నం చేసినప్పటికీ వీలు కాలేదు. ఈ ప్రయత్నంలో ఆమె రోడ్డుపై పడిపోయింది. కూతురు కూడా తల్లిని రక్షించుకునేందుకు ప్రయత్నించింది. అయినా కూడా పోలీసులు కనికరించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.