బూతులు తిట్టిన ట్రాఫిక్ పోలీస్ : చెంప పగల గొట్టిన మహిళ (వీడియో)

బూతులు తిట్టిన ట్రాఫిక్ పోలీస్ : చెంప పగల గొట్టిన మహిళ (వీడియో)

ట్రాఫిక్ నిబంధనల్ని ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించినందుకు ఓ మహిళ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పై దాడి చేసింది.  ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దక్షిణ ముంబైలోని కల్బదేవి ప్రాంతంలో ఓ మహిళకు  , ట్రాఫిక్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. డ్రైవింగ్ చేసే సమయంలో మహిళ హెల్మెట్ ధరించకపోవడంతో  ఆమె వెహికల్ ను ఆపాడు ఓ ట్రాఫిక్ పోలీస్ . అదే సమయంలో  పోలీస్ సదరు మహిళను బూతులు తిట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలు అతనిపై దాడి చేసింది. ఆమె దాడి చేసే సమయంలో స్థానికులు వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  కొద్ది సేపటికి అక్కడే ఉన్న మహిళా పోలీస్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.