Viral video: మహిళను కుక్కలా గొలుసుకట్టి తీసుకెళ్తున్న మరో మహిళ.. మండిపడుతున్న నెటిజన్లు

Viral video: మహిళను కుక్కలా గొలుసుకట్టి తీసుకెళ్తున్న మరో మహిళ.. మండిపడుతున్న నెటిజన్లు

కుక్కలను కొందరు హాబీగా పెట్టుకుంటారు. వేలకు వేలు పోసి కుక్కులను కొనుగోలు చేస్తుంటారు. వాటిని వీధుల్లోకి అలా వాకింగ్ కు తీసుకెళ్లి సంబర పడుతుంటారు. కుక్క ఏ జాతికి చెందింది. ఎంత పెట్టి కొన్నారు..ఎంత స్టయిలిస్ ఉంటుంది. ఇలా చాలా విషయాలను ఇతరులతో సమయం దొరికినప్పుడల్లా చర్చిస్తుంటారు. కానీ ఒకామె మనిషినే కుక్కలా పెంచుకుంటుంది. కుక్కకు ఎలా మెడకు కాలర్ కట్టి వీధుల్లోకి తీసుకెళ్తుందో అచ్చు అలాగే తీసుకెళ్తోంది. ఆమె, ఆమె కుక్క కథేంటో చూద్దాం రండి.. 

ఓ మహిళ మరో మహిళను మెడలో కాలర్ కట్టి కుక్కలా తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు మహిళల జంతు వేషాలను ప్రజలను వింతగా చూశారు. ముంబైలోని మీరా భయందర్ ప్రాంతంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. 

వైరల్ అవుతున్న వీడియోలో.. మహిళ నాలుగు కాళ్ల జంతువులా, కుక్కలా నటిస్తోంది. ఆమె మెడకు డాగ్ కాలర్ కట్టబడి ఉంది. మరో మహిళ పట్టీ పట్టుకొని వీధిలో నడుస్తూ కనిపిస్తుంది. రద్దీగా ఉండే రహదారిపై ఈ ఘటన జరిగింది. వీరిద్దరిని చూసిన ప్రజలు వింతగా చూస్తే నవ్వుకున్నారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వాట్ ఈజ్ దిస్ అంటూ గరం.. గరం అవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కించపరిచేలా ఏంటీ పనులు .. ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు అని అంటున్నారు. ఇంకొందరు ముందుకు వెళ్లి ఇన్ స్టాగ్రామ్ ను బ్యాన్ చేసే సమయం వచ్చింది. ఈ మహిళలు ఇద్దరు ఇన్ స్టాలో టిక్ టాక్ చేసేవాళ్లలా ఉన్నారు అని మండిపడ్డారు.  వీరిపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను, మహారాష్ట్ర సీఎం కోరారు.ఈ వీడియోపై ముంబై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.