పెళ్లికొచ్చారు.. కుర్చీలతో కొట్టకుని.. అన్నీ విరగొట్టారు

పెళ్లికొచ్చారు.. కుర్చీలతో కొట్టకుని.. అన్నీ విరగొట్టారు

ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌  జరిగిన ఓ వివాహ వేడుకలో అతిథులు  గొడవపడ్డారు. దీంతో అతిథులు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు శుభకార్యాలకు ఇందుకేనా వచ్చేదని వ్యాఖ్యానిస్తున్నారు.

కంప్యూటర్​ యుగంలో  పెళ్లిళ్లను ఉత్సవం మాదిరిగా చేయాలనుకుంటున్నారు.  ఆ పెళ్లి వేడుక గురించి  కొన్ని సంవత్సరాలు  చర్చించుకోవాలని జనాలు తాపత్రయ పడుతున్నారు.  దీనికోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు.  ఉత్తర ప్రదేశ్​ లోని అలీఘర్​ లో జరిగిన వివాహ వేడుక అలా గుర్తుండిపోవాలని చేశారో ఏమో తెలియదు కాని... పెళ్లికి వచ్చిన అతిథులు కుర్చీ వార్​ కు తెరలేపారు. కుర్చీలు విరిగేలా కొట్టుకుంటూ పెళ్లి వేడుకను డిజాస్టర్​ వేడుకగా మార్చారు.  

ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తుంది.  పెళ్లికి వచ్చి.. పెట్టింది తిని పోవాల్సిన అతిథులు అక్కడ హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు.  అయితే ఈ గొడవ ఎందుకు జరిగిందో ఇంకా తెలియరాలేదు కాని ... ఆహారం కొరత కారణంగా గొడవ జరిగి ఉండవచ్చని కొంతమంది భావిస్తున్నారు. 

పెళ్లిలో అతిథులు చేసిన నిర్వాకం ఫిబ్రవరి 12న సోషల్​ మీడియా ప్లాట్​ ఫారమ్​ X (గతంలో ట్విట్టర్)లో అలీఘర్ వెడ్డింగ్‌లో కుర్చీ యుద్ధం అని హిందీ క్యాప్షన్​తో పోస్ట్​ చేశారు.  ఈ వీడియో పోస్ట్​ చేసిన వెంటనే 11 వేల  వీక్షణలు కంటే ఎక్కువ వచ్చాయి.  ఈ వీడియో వైరల్​ కావడంతో నెటిజన్లు స్పందించారు.  గొడవకు కారణం ఆహారమేనని కొంతమంది రాయగా.. మరొకరు బాగ్‌పత్  చాట్ యుద్దం తర్వాత ఈ వార్​ మార్కెట్ లోకి వచ్చిందని  రాసుకొచ్చారు.    కొంతమంది  ఈ ఘటన పట్ల అసంతృప్తికి వ్యక్తపరుస్తూ  ది గ్రేట్ #BattleOfBaghpath గురించి  గుర్తొస్తుందని రాసుకొచ్చారు.