బిడ్డకు ‘బార్డర్’ పేరు పెట్టిన పాక్ దంపతులు 

బిడ్డకు ‘బార్డర్’ పేరు పెట్టిన పాక్ దంపతులు 

పిల్లలు పుడితే వారికి ఏ పేరు పెట్టాలని ముందు నుంచి ఆలోచిస్తాం. పుణ్యక్షేత్రాలు, దేవుళ్లు, స్వాతంత్ర్య సమరయోధులతోపాటు నచ్చిన ఆటగాళ్లు, నటుల పేర్లు పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడో పిల్లవాడికి బార్డర్ గా నామకరణం చేశారు తల్లిందండ్రులు. ఈ ఘటన పంజాబ్ లోని అటారీ వాఘా సరిహద్దులో చోటు చేసుకుంది. పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళ ఈనెల 2న ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 

భారత్ పాక్ సరిహద్దులో పుట్టిన ఆ బిడ్డకు బార్డర్ అని పేరు పెట్టారు పేరెంట్స్ నింబూ బాయి, బలమ్ రామ్. పాక్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ దంపతులు గతంలో ఒకసారి భారత్ కు రావడం గమనార్హం. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడం, పాక్ సరిహద్దులు మూసేయడంతోపాటు సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో వారు అటారీ వాఘా బార్డర్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ టైమ్ లో నింబూ  బాయి గర్భిణి. రీసెంట్ గా ఆమెకు మగ బిడ్డ పుట్టాడు. కాగా, అటారీ బార్డర్ లోనే ఉంటున్న లాగ్యా రామ్ అనే మరో పాక్ వ్యక్తి గతేడాది పుట్టిన తన కుమారుడికి భారత్ అని పేరు పెట్టడం విశేషం.