ఫలించిన 30ఏళ్ల తల్లి కళ.. కొడుకు కోసం జీవితాన్నే త్యాగం చేసింది

ఫలించిన 30ఏళ్ల తల్లి కళ.. కొడుకు కోసం జీవితాన్నే త్యాగం చేసింది

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య, జీవితాన్ని అందించడానికి ఎంతో కృషి చేస్తారు. కొన్నిసార్లు వారు తమ పిల్లలకు సంతోషకరమైన, శాంతియుత వాతావరణాన్ని అందించడానికి వారి అవసరాలను పక్కన పెట్టి మరీ పిల్లల కోసం కష్టపడతారు. ఇదే తరహాలో పైలట్ కావాలనుకున్న తన కుమారుడిని చదివించేందుకు ఓ మహిళ మూడు దశాబ్దాలుగా హౌస్ కీపర్ గా పనిచేసింది. ఫైనల్ అతను పైలట్ అయ్యాడు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా యూజర్ల  హృదయాలను ద్రవింపజేస్తోంది.

వన్ పర్సంటైల్ అనే యూజర్ ఈ పోస్ట్ ను రెడ్డిట్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో, మహిళ విమానంలోకి ప్రవేశించడం, ఆమె టిక్కెట్‌ను సిబ్బంది తనిఖీ చేయడం కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని సెకన్లలోనే.. ఎయిర్ హోస్టెస్ కర్టెన్లను తీసివేయడంతో పైలట్ యూనిఫాంలో ఉన్న అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె అతన్ని కౌగిలించుకున్న ఈ భావోద్వేగ క్షణం ఇంటర్నెట్‌ను కంటతడి పెట్టించింది.

Also Read :- అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుగా తేజ్

"పైలట్ కావడానికి తన కొడుకు చదువుకు స్పాన్సర్ చేయడానికి 30 ఏళ్లపాటు హౌస్ కీపర్‌గా పనిచేసిన ఒక మహిళ.. అతన్ని విమానంలో చూడగానే ఆనందానికి గురయింది" అని ఈ వీడియోకు క్యాప్షన్ గా జోడించారు. ఈ క్లిప్ షేర్ అయినప్పట్నుంచి 79వేల లైక్‌లను పొందింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్ సెక్షన్ లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. "మా అమ్మ ఈ సంవత్సరం ప్రారంభంలో మరణించింది. ఆమెతో ఇలా ఒక్క క్షణం గడపడానికి నేను ఏం చేయగలను. మీ తల్లిదండ్రులను గౌరవించండి”అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. “ఖచ్చితంగా మధురమైన విషయం. చిరునవ్వులు అన్నీ చెబుతాయి” అని ఒకరు.. “ఈ వారం నేను చూసిన అత్యంత హెల్దీ వీడియో. ఆమె చేసిన త్యాగాల ఫలితాన్ని ఆ అమ్మ తన కుమారుడిలో చూడడం ఎంత గర్వకారణమైందో నేను ఊహించగలను” అని మరొకరు జోడించారు.