కలెక్టర్, ట్రైనీ కలెక్టర్కు రాఖీలు

కలెక్టర్, ట్రైనీ కలెక్టర్కు రాఖీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కలెక్టర్​ జితేశ్​ వి.పాటిల్, ట్రైనీ కలెక్టర్​ సౌరభ్​శర్మకు కలెక్టరేట్​లో కొత్తగూడెం కోర్టుకు చెందిన మహిళా అడ్వకేట్లు శుక్రవారం రాఖీలు కట్టారు. కార్యక్రమంలో అడ్వకేట్లు ఆర్తి మక్కడ్, నకరికంటి ఉమ, యాస మౌనిక, అరుణలత, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.