సీఎం కాన్వాయ్​లో తృటిలో తప్పిన ప్రమాదం

సీఎం కాన్వాయ్​లో తృటిలో తప్పిన ప్రమాదం

జనగామ, వెలుగు: వరంగల్ ​పర్యటనకు వెళ్తున్న సీఎం కాన్వాయ్​లో తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం జనగామ శివారు పెంబర్తి కళాతోరణం వద్ద సీఎం కేసీఆర్​కు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్​ బయలుదేరుతుండగా రన్నింగ్​కారు ఎక్కేందుకు ప్రయత్నించిన సీఎం సెక్యూరిటీ సిబ్బందిలోని ఓ మహిళా​కానిస్టేబుల్ జారి రోడ్డుపై పడిపోయింది. స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహచర సెక్యూరిటీ స్టాఫ్​ఆమెకు సాయమందించగా వెహికల్​ఎక్కి వెళ్లిపోయింది.