
షాజహాన్‌పూర్(యూపీ): లాక్డౌన్ ఎఫెక్ట్‌తో ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను సైకిల్‌పై ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ్యలో నొప్పులు రావడంతో రోడ్డుపైనే పండంటి ఆడపిల్లను ప్రసవించిందని శనివారం పోలీసులు వెల్లడించారు. ‘‘ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం రఘునాథ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళను ఆమె భర్త సైకిల్‌పై మద్నాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు సైకిల్‌పై తీసుకెళ్లాడు. వారి ఊరి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ జంట ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత సికందర్పూర్ గ్రామం వద్దకు చేరుకోగానే మహిళకు నెప్పులు వచ్చాయి. అక్కడికక్కడే ఆమె ఆడ పిల్లను కన్నది”అని సూపరింటెండెండ్ ఆఫ్ పోలీస్(రూరల్) అపర్ణా గౌతం చెప్పారు. దగ్గరలో ఉన్న పోలీస్ రెస్పాన్స్ వ్యాన్(పీఆర్వీ)కి సమాచారం ఇచ్చి ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినట్టు చెప్పారు. దగ్గరలోని పొలంలో పనిచేసే మహిళ ఆమెకు ప్రసవం చేసిందన్నారు. ఆ మహిళ సాయంతో పీఆర్వీ వెహికల్ లో ఉన్న మీటు తోమర్.. తల్లి, బిడ్డలను ఆస్పత్రికి తరలించాడని, ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని గౌతం చెప్పారు.