మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

గ్రేటర్​ వరంగల్/ ఏటూరునాగారం, వెలుగు: మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ మహా నగర పాలక సంస్థ - మెప్మా నిర్వహించిన మహిళా సమైక్య సంఘాల 16వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోందన్నారు. 

ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ ఆఫీస్​లో వివాహాల నిర్వాహకులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ఈ.పి. ప్రేమలత అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్ హౌస్ నిర్వాహకులు, ఫోటోగ్రాఫర్లు, ఫ్లెక్సీ లు ముద్రించేవారు, క్యాటరింగ్, బ్యాండ్ మేళం నిర్వాహకులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు నిర్వహించినా, సహకరించినా, ప్రోత్సహించినా సదరు భాధ్యులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఐటీడీఏ పీవో నాగోరావు మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికడితేనే బాల బాలికల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందన్నారు.