- ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ధర్నా
అల్వాల్, వెలుగు: మేడ్చల్ జిల్లా అల్వాల్‌కు చెందిన ఓ మహిళ మృతిచెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ప్రైవేట్ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అల్వాల్ సిటిజన్ కాలనీకి చెందిన ప్రభావతి(45) వేలికి గాయమై, రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ కోసం ఈ నెల 4న స్థానిక ఎక్సెల్ ఆస్పత్రిలో చేరారు. తర్వాత ఆమెకు బీపీ ఎక్కువగా ఉందని డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చారు.
కాసేపటికే ప్రభావతి ఆరోగ్యం విషమించింది. వైద్యుల సూచనతో కుటుంబసభ్యులు వెల్నెస్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.
డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రభావతి చనిపోయిందంటూ కుటుంబీకులు శుక్రవారం ఎక్సెల్హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ
చేపట్టారు.
