కుటుంబానికి ఆసరాగా ఆమె

కుటుంబానికి ఆసరాగా ఆమె

హైదరాబాద్, వెలుగు: కుటుంబం  నడవాలంటే దానివెనుక ఆ ఇంటి పెద్ద పాత్ర ఎంతో ఉంటుంది.  కొన్ని  కుటుం
బాల్లో  మహిళలే కుటుంబ పెద్దగా ఉండి, ఇంటిని నడిపిస్తున్నారు.    కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు.వచ్చేది కొద్దిపాటి ఆదాయమైనా  ఇంటి కోసం తమ వంతు ఖర్చు చేస్తున్నారు.  

అన్నీ తానై...
సిటీలోని కొన్ని కుటుంబాల్లో ఇంటి పెద్దగా మహిళలే ఉంటున్నారు.  ఎంచుకున్న రంగంలో ఇష్టంగా  పని చేస్తూనే.. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు.   తల్లిదండ్రులు, అత్తామామలు, పిల్లల బాధ్యతను తీసుకుని మగవారితో దీటుగా పని చేస్తున్నారు.  ఇంటి అద్దె, నిత్యావసర వస్తువులు, నెలవారీ ఖర్చులు, పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు, వారి అవసరాలు, ఇంట్లోని పెద్దవాళ్ల ఆరోగ్యబాధ్యతలు అన్నింటిని ఏ మాత్రం బెరుకు లేకుండా చక్కబెడుతున్నారు.   ఇలా ప్రస్తుతం అనేకమంది ఏదో ఒక పనిచేస్తూ ఇంట్లో వాళ్లను చూసుకుంటున్నారు. 

ఆటో నడుపుతూ..
నేను ఆటో నడుపుతా.  రోజుకి వెయ్యి నుంచి 1200లు వస్తాయి. అందులో నుంచి కొంత అమౌంట్ ని ఇంటి అద్దె కడ్తా.  ఇద్దరు కొడుకులకు నెలనెలా 5,500లు స్కూల్ ఫీజు కడ్తున్నా.  మా అమ్మ నా దగ్గరే ఉంటుంది. తనను కూడా నేనే చూసుకుంటా. నా భర్త  ఆటో నడుపుతూ.. తాగుబోతై నన్ను నా పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు.   ఇప్పుడు ఆ ఆటోను నేను నడుపుతున్న. అదే  నాకు బతుకుదెరువైంది.
- మాధురి, ఆటోడ్రైవర్, పార్శిగుట్ట మీల్స్ 

అమ్ముతున్నా..
నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరికి పెండ్లిళ్లయ్యాయి. భర్త అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటాడు.  ఇదివరకు  కుట్లు అల్లికలు చేస్తుండేదాన్ని. వాటికి గిరాకీ లేకపోవడంతో తక్కువ పెట్టుబడితో మీల్స్ వ్యాపారం మొదలుపెట్టాను. ఇంట్లో వండి తీసుకెళ్లి అమ్ముతున్నా. పెట్టుబడి పోనూ రోజు రూ. 300  నుంచి రూ.500 వరకు మిగులుతున్నాయి.  - షాహిన్, గచ్చిబౌలి

ఐదువేలతోనే..
మాది నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్. 14 ఏండ్ల  కిందట ఉపాధి కోసం సిటీకి వచ్చాం. నా భర్తకు ఆరోగ్యం సరిగా ఉండదు. నేను  ఒక అపార్ట్​మెంట్​లో సెక్యూరిటీగా పనిచేస్తున్నా. అపార్ట్​మెంట్ కిందనే చిన్న రూమ్​లో నేను, నా బిడ్డ, మా ఆయన ఉంటాం. కొడుకు వేరే ఊరిలో  పాలిటెక్నిక్ కోర్స్ చేస్తున్నాడు. నాకు నెలకి 5వేల జీతం వస్తుంది. రెంట్​ సమస్య లేకపోవడంతో  రూ.1,500లు నా కూతురికి స్కూల్ ఫీజు కడ్తున్నా.మిగతా డబ్బులతో ఇంటి అవసరాలు తీరుతున్నాయి. 
- అంజమ్మ , ఓయూ కాలనీ, షేక్ పేట