ఇళ్ల మధ్య వైన్స్ ఎలా పెడతారు? 

ఇళ్ల మధ్య వైన్స్ ఎలా పెడతారు? 

ములుగు: ఇళ్ల మధ్యలో మద్యం షాప్ ఎలా ఏర్పాటు చేస్తారంటూ మహిళలు ధర్నాకు దిగారు. ఈ ఘటన ములుగు జిల్లా, వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలో కొత్తగా కేటాయించిన వైన్స్ షాపును ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పెట్టారు. అయితే చుట్టుపక్కల ఇళ్లు ఉన్నాయని చూడకండా, ఇలా ఇళ్ల మధ్యే వైన్ షాపును పెట్టడంపై స్థానిక మహిళలు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే మద్యం సేవించే వారితో తట్టుకోలేకపోతుంటే.. ఇలా ఇళ్ల మధ్యే షాపు పెడితే ఎలా అంటూ కాలనీ మహిళలు ఆందోళనకు దిగారు. మందు తాగేవారితో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. ఊరి మధ్యలో ఏర్పాటు చేసిన వైన్స్ ను తొలగించే వరకు ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు.