మణిపూర్‌‌‌‌కు త్వరలో నవోదయం.. రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతం: ప్రధాని మోదీ

మణిపూర్‌‌‌‌కు త్వరలో నవోదయం.. రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతం: ప్రధాని మోదీ
  • ఇది ధైర్యవంతుల నేల.. ఈశాన్యానికే రత్నం 
  • కుకీలు, మైతేయిల మధ్య నమ్మకమనే బ్రిడ్జి నిర్మిస్తం
  • నిరాశ్రయులను ఆదుకుంటామని వెల్లడి
  • 2023 అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్‌‌‌‌లో పీఎం పర్యటన.. బాధితులకు పరామర్శ 
  • రూ.8,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 
  • మిజోరంలో ఫస్ట్ రైల్వే లైన్ షురూ

చురాచంద్‌‌పూర్‌‌‌‌ / ఇంఫాల్‌‌: హింసాత్మకంగా మారిన మణిపూర్‌‌‌‌లో మళ్లీ శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. హింసను వీడాలని వివిధ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి త్వరలోనే నవోదయం వస్తుందన్నారు. కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలతో 2023లో మణిపూర్‌‌‌‌లో అల్లర్లు చెలరేగగా, రెండేండ్ల తర్వాత ప్రధాని మోదీ తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు. కుకీలు ఎక్కువగా ఉండే చురాచంద్‌‌పూర్, మైతేయిలు ఎక్కువగా ఉండే ఇంఫాల్‌‌లో శనివారం నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు.

మణిపూర్ ప్రకృతి ప్రసాదించిన కానుక, ధైర్యవంతుల నేల అని అన్నారు. ‘‘మణిపూర్ అందమైన ప్రాంతం. కానీ దురదృష్ట వశాత్తు ఇక్కడ హింస చెలరేగింది. రాష్ట్రంలో మళ్లీ శాంతిని నెలకొల్పేందుకు మా ప్రభుత్వం ప్రయ త్నాలు చేస్తున్నది. ఇప్పటికే శాంతి చర్చలు మొదల య్యాయి. హింసను వీడి శాంతి వైపు పయనించా లని అన్ని సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శాంతి, అభివృద్ధికి చిహ్నంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నాం” అని తెలిపారు. 

‘‘ఆశలు, ఆకాంక్షలకు మణిపూర్ ప్రతిరూపం. నేను ఇంతకుముందే రిలీఫ్ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతమంది బాధితులను కలి శాను. వాళ్లలో భవిష్యత్తుపై నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే రాష్ట్రానికి నవోదయం వస్తుంది. మణి పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరులోనే మణి ఉంది. మణి అంటే రత్నం. మణిపూర్ రానున్న రోజుల్లో ఈశాన్య రత్నం అవు తుంది” అని చెప్పారు. ‘‘ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి ముఖ్యం. గత 11 ఏండ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో వివాదాలను పరిష్కరించాం. ప్రజలు శాంతి వైపు పయనించి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు” అని పేర్కొన్నారు.

రాష్ట్రానికి అండగా ఉంటం..
రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 7 వేల కొత్త ఇండ్లను కట్టేం దుకు రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సాయం అందిస్తున్నామని తెలిపారు. రూ.3 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి ఇటీవల ఆమోదం తెలిపామని చెప్పారు. ఇందులో నిరాశ్రయుల కోసమే ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించామని వెల్లడించారు. మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధితులను ఆదుకునేందుకు, శాంతిని నెలకొల్పేందుకు, అభివృద్ధి పనులకు రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.

‘‘గతంలో నిర్ణయాలన్నీ ఢిల్లీలో జరిగేవి. అవి అమలయ్యేందుకు దశాబ్దాలు పట్టేది. కానీ, ఇప్పుడు దేశంలోని మిగతా రాష్ట్రాల లెక్కనే మణిపూర్ అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలోని హిల్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. చురాచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసి, ఆ కలను మేం నెరవేర్చాం. గత ఏడేనిమిదేండ్ల కింద మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 వేల ఇండ్లకే నల్లా నీళ్లు వచ్చేవి. ఇప్పుడు 3.5 లక్షల ఇండ్లకు వస్తున్నాయి” అని వివరించారు. 

రోడ్డు మార్గంలో 61 కి.మీ.
ప్రధాని మోదీ మొదట శనివారం ఉదయం ఇంఫా ల్ చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చురాచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ వెళ్లాల్సి ఉండగా, భారీ వర్షం కార ణంగా హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెళ్లడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. దీంతో రోడ్డు మార్గంలోనే 61 కి.మీ. ప్రయాణించి చురాచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ చేరుకున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని, మళ్లీ ఇంఫాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. చురాచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో7,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేశారు. అలాగే ఇంఫాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో1,200 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. 

హింసకు కారణమేంటి ?
మైతేయిలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదనను కుకీలు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తి హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో 260 మందికి పైగా చనిపోయారు. 40 వేల మంది కుకీలు, 20 వేల మంది మైతేయిలు నిరాశ్రయులయ్యారు.

మిజోరానికి ఫస్ట్ రైల్వే లైన్
ఒకప్పుడు ఓటు బ్యాంక్ పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సతమతమై న నార్త్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజియన్.. ఇప్పుడు మన దేశ గ్రోత్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం మిజోరంలో ఆయన పర్యటించారు. భారీ వర్షం కారణంగా ఐజ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన బహిరంగ సభకు వెళ్లలేని మోదీ.. సిటీలోని లెంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుయ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచే వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రూ.9 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

మిజోరంలో రూ.8,070 కోట్లతో నిర్మించిన మొట్టమొదటి రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైరాబి–సైరాంగ్ (51.38 కిలోమీటర్లు) లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ఐజ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఢిల్లీ, గువాహటి, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాకు మూడు కొత్త రైళ్ల ను కూడా ప్రారంభించారు. ‘‘ఇది రాష్ట్రానికి చరిత్రాత్మక రోజు. ఇయ్యాల్టి నుంచి మిజోరం ఇండియన్ రైల్వే మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరుతుంది. ఐజ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ రాష్ట్రం దేశ రైల్వే కనెక్టివిటీలో చేరింది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

నమ్మకమనే బ్రిడ్జి నిర్మిద్దాం..
మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొండ (కుకీలు), లోయ (మైతేయిలు) ప్రాంతాల్లోని ప్రజల మధ్య నమ్మకమనే బలమైన బ్రిడ్జిని నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పడం అత్యవసర మని.. అది చర్చలు, ఐక్యమత్యం ద్వారానే సాధ్యమని చెప్పారు. ‘‘భరతమాత కిరీటంలోని రత్నం మణిపూర్. అలాంటి రాష్ట్రంలో హింసను సహించేది లేదు. ఇలా జరగడం దురదృష్టకరం. ఇది మన భవిష్యత్తు తరాలకు ఏమాత్రం మంచిది కాదు. మనందరం కలిసి మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శాంతి, అభివృద్ధి వైపు నడిపించాలి” అని పిలుపునిచ్చారు. 

మణిపూర్ అభివృద్ధి చెందేందుకు మస్తు అవకాశాలు ఉన్నాయని, కానీ, హింస కారణంగా వెనుకబడుతున్నదని పేర్కొన్నారు. ‘‘ఇండియన్ నేషనల్ ఆర్మీ మొదటిసారి జాతీయ జెండాను ఎగరేసింది మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే. ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది అమరులు ఉన్నారు. వాళ్ల త్యాగాల స్ఫూర్తితోనే మేం ముందుకుపోతున్నం” అని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిడ్డలు కీలక పాత్ర పోషించారని చెప్పారు.  

అల్లర్ల బాధితుల పిల్లల కన్నీళ్లు..
మణిపూర్‌‌‌‌లో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ప్రధాని మోదీ పరామర్శించారు. చురాచంద్‌‌పూర్, ఇంఫాల్‌‌లో బాధితులతో ఆయన మాట్లాడారు. రెండు చోట్లా సాధారణ ప్రజలు, కొంతమంది స్కూల్ స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానికి బాధితులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.