వీళ్లు ఎయిర్ స్ట్రైక్స్ లో పాల్గొనలేదు

వీళ్లు ఎయిర్ స్ట్రైక్స్ లో పాల్గొనలేదు

Women Pilot urvashi jariwala Didn’t Carry Out Air Strike on Pakistanవెలుగు, న్యూఢిల్లీ: పాకిస్థాన్ లోని బాలాకోట్ టెర్రర్ క్యాంపుపై ‘సర్జికల్ స్ట్రైక్స్–2.0’ జరిగిన నాటి నుంచి ‘ఊర్వశి జరివాలా’ అనే పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. బాలాకోట్‌‌పై అటాక్ చేసిన 12 మంది పైలట్లలో ఊర్వశి కూడా ఒకరంటూ నెటిజన్లు ఫొటోలు షేర్ చేస్తున్నారు. వీటికి వేల సంఖ్యలో లైక్స్, షేర్స్ వచ్చాయి. అయితే, అది నిజం కాదని తేలింది. ఆమె ఊర్వశి కాదు. బాలాకోట్ దాడుల్లోనూ పాల్గొనలేదు. కొన్ని పోస్టుల్లో ఊర్వశి సూరత్ కు చెందిన అమ్మాయని, ఇందుకు సూరత్ ప్రజలంతా గర్వించాలని కూడా పేర్కొన్నారు.

Women Pilot urvashi jariwala Didn’t Carry Out Air Strike on Pakistan

వైరల్ అవుతున్న ఫొటోల్లో స్క్వా డ్రన్ లీడర్ స్నేహా షెకావత్ చిత్రం కూడా ఉంది. ఈమె 2015 రిపబ్లిక్ డే పరేడ్‌‌లో ఎయిర్ ఫోర్స్‌‌ కంటింజెంట్‌‌ను లీడ్ చేశారు. నిజానికి ఆపరేషన్లలో పాల్గొనే వారి పేర్లను సీక్రెట్ గా ఉంచుతారు. బాలాకోట్ ఆపరేషన్ విషయంలోనూ ఇదే జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లతో, ఎయిర్ స్ట్రైక్స్ లో పాల్గొన్న పైలట్లకు ఎలాంటి సంబంధం లేదు.

Women Pilot urvashi jariwala Didn’t Carry Out Air Strike on Pakistan