ప్రియాంక రెడ్డి ఘటనపై ఢిల్లీలో నిరసన

ప్రియాంక రెడ్డి ఘటనపై ఢిల్లీలో నిరసన

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై ఢిల్లీలో నిరసన తెలిపింది ఓ యువతి. ఈ ఘటన పార్లమెంట్ దగ్గరలో జరిగింది. అనూ దుబే అనే యువతి రాష్ట్రంలో జరిగిన ప్రియాంక ఉదంతం పై స్పందించింది. ఇందుకు గాను తన నిరసనను తెలిపింది. ఆయా ప్రభుత్వాలు మహిళల భద్రతపై సరైన చర్యలు తీసుకోవాలని కోరింది. నిరసన పార్లమెంట్ పరిసరాలలో చేయడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సదరు యువతిని అదుపోలోకి తీసుకున్నారు. కొంతసేపటికి ఆ మహిళను వదిలిపెట్టారు.

నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడండి.. రాష్ట్ర డీజీపీకి కిషన్ రెడ్డి ఆదేశం
ప్రియాంక ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పంధించాడు. నింధితులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వీరితో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళిధర్ రావు, మాజీ ఎమ్మెల్యే చితేందర్ రెడ్డి తమ సానుభూతిని తెలిపారు.

ప్రియాంక రెడ్డి కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రగాడ సానుభూతి
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి ఘటనపై రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ప్రియాంక రెడ్డి కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు రాహుల్. నింధితులకు సరైన శిక్ష పడాలని కోరారు.