శివ్వంపేట మండలంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన

శివ్వంపేట మండలంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన

శివ్వంపేట, వెలుగు: మండలంలోని బిక్యా తండా గ్రామ పంచాయతీలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగడానికి నీళ్లు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామున్నారు. రైతులు వ్యవసాయ బోర్ల దగ్గరికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగడానికి నీళ్లు కొని తెచ్చుకుంటున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శిని కనీసం సింగిల్ ఫేస్ మోటారు రిపేరు చేయించమంటే గ్రామపంచాయతీలో నిధులు లేవని చెబుతున్నారన్నారు.