లోప్రెషర్ సమస్యతో నల్లా నీళ్లు రావట్లే

లోప్రెషర్ సమస్యతో నల్లా నీళ్లు రావట్లే
  •     ఖాళీ బిందెలతో మహిళల నిరసన

సికింద్రాబాద్, వెలుగు :  లోప్రెషర్​సమస్యతో మంచినీటి సరఫరా సక్రమంగా జరగట్లేదని కొందరు మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో ప్రకాశ్​నగర్​సెక్షన్​వాటర్ వర్క్స్​ఆఫీస్​వద్ద నిరసనకు దిగారు. నెల రోజులుగా నల్లా సరిగ్గా రావడం లేదని, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

వాటర్ వర్క్స్​అధికారులకు విన్నవించినా సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించారు. తక్షణమే స్పందించి లోప్రెషర్​సమస్య లేకుండా చేయాలని కోరారు.