హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: గ్రామంలో బెల్టుషాపులను నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ మహిళలు పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో శనివారం బెల్ట్‌షాపుల ఎదుట మహిళలు పురుగుల మందు డబ్బాలను చేతిలో పట్టుకుని ఆందోళనకు దిగారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. షాపులు తొలగించకుంటే హుస్నాబాద్‌లోని ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
