పదవికి రాజీనామా చేయడమే నయమన్న మహిళా సర్పంచ్

పదవికి రాజీనామా చేయడమే నయమన్న మహిళా సర్పంచ్

సర్పంచ్ పదవికి రాజీనామా చేయడమే నయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ మహిళా సర్పంచ్. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రెడ్యా తండాకు చెందిన రంగీలా ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలన్నా, పంచాయతీ వర్కర్లకు జీతాలు ఇవ్వాలన్న, ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టాలన్నా ఉప సర్పంచ్ జగన్ చెక్కుల పై సంతకం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె గ్రామపంచాయతీ ఆఫీస్ ముందు చెక్కులతో నిరసన వ్యక్తం చేశారు.

 తాను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికైనందుకు, ప్రత్యేక నిధులు వస్తాయి.. తండాను అభివృద్ధి చేయొచ్చని ఎంతో సంతోషపడ్డానని రంగీలా తెలిపారు.  అయితే ఫండ్స్ రాకపోవడంతో తనపై ఎంతో నమ్మకంతో  ఏకగ్రీవంగా ఎన్నుకున్న తండా వాసులకు న్యాయం చేయలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు  ఉప సర్పంచ్ చెక్కుల పైన సంతకాలు చేయకపోవడంతో రెండు నెలల నుండి వర్కర్లకు జీతాలు ఇవ్వలేకపోతుండటంతోపాటు, పంచాయతీ ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టలేక పోతున్నట్టు తెలిపారు. ఈ ఇబ్బందులకంటే పదవికి రాజీనామా చేయడం మంచిదనిపిస్తోదని సర్పంచ్ రంగీల ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, డీపీఓ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.