
కరీంనగర్ జిల్లా: జీవితం మీద విరక్తి వచ్చి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటుండగా పోలీసులు చాకచక్యంగా వ్యవహారించి ఆమెను కాపాడారు. ఈ సంఘటన బుధవారం కరీంనగర్ జిల్లాలో జరిగింది. కట్టరాంపూర్ ప్రాంతానికి చెందిన వివాహిత(23), తన రెండేళ్ల పాపతో కలిసి మానేరు డ్యామ్ లోకి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా లేక్ పోలీసులు రక్షించారు.
భర్త, అత్తింటి వారు ఎలాంటి కారణాలు లేకుండానే శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని.. అందుకే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోనేందుకు ప్రయత్నించిందని లేక్ పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్ ఛార్జీ ఎస్ఐ సతీష్ తెలిపారు. ఆమెను మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలిపారు.