నల్గొండలో మహిళా ఓటర్లే ఎక్కువ

నల్గొండలో మహిళా ఓటర్లే ఎక్కువ
  • డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన ఆఫీసర్లు
  • ఆరు నియోజకవర్గాల్లో 13.54 లక్షల మంది ఓటర్లు
  • ఇక నుంచి ఏడాదికి మూడుసార్లు ఓటరు నమోదుకు చాన్స్‌‌‌‌‌‌‌‌

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ను బుధవారం ఆఫీసర్లు విడుదల చేశారు. నల్గొండ, మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాల్లో మొత్తం 13,54,821 మంది జనరల్‌‌‌‌‌‌‌‌, 537 మంది సర్వీస్‌‌‌‌‌‌‌‌ ఓటర్లు ఉన్నారు. ఇందులో దేవరకొండ నియోజకవర్గంలో 2,29,846 మంది, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లో 2,19,305, మిర్యాలగూడలో 2,09,038, నల్గొండలో 2,22,100, నకిరేకల్‌‌‌‌‌‌‌‌లో 2,32,727 మంది ఓటర్లు ఉండగా, మునుగోడు నియోజకవర్గంలో 2,41,805 మంది ఉన్నారు. డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం నల్గొండ జిల్లాలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. జిల్లాలో పురుషులు 6,76,047 మంది ఉండగా, మహిళలు 6,78,758, ఇతరులు 16 మంది ఉన్నారు. నల్గొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటర్లలో అత్యధికంగా మునుగోడు, నకిరేకల్, దేవరకొండ నియోజకవర్గాల్లోనే ఉండడం విశేషం.

ఇక నుంచి ఏడాదికి మూడు సార్లు ఓటరు నమోదు

ఓటరు నమోదు కార్యక్రమంలో ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే ఓటరు నమోదు చేసుకునే అవకాశం ఉండగా, ఇక నుంచి ఏడాదికి మూడు సార్లు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, జులై, అక్టోబర్‌‌‌‌‌‌‌‌ ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కు కోసం ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు. వీటిని ఆఫీసర్లు పరిశీలించి అర్హత తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారికి ఓటు హక్కు కల్పిస్తారు.

అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

సూర్యాపేట : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని సూర్యాపేట అడిషినల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌రావు సూచించారు. బుధవారం సూర్యాపేటలోని ఉమెన్స్ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫారం 6 నింపడంతో మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. క్యాంపస్ అంబాసిడర్లు, ఎలక్ట్రోరల్‌‌‌‌‌‌‌‌ లిటరసీ క్లబ్‌‌‌‌‌‌‌‌లు ప్రత్యేక దృష్టి పెట్టి ఓటరు నమోదు వందశాతం పూర్తయ్యేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ పీడీ పెంటయ్య పాల్గొన్నారు.