నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో మొదటి దశలో జరిగిన ఆరు మండలాల్లో మహిళా ఓటర్లే కీలక పాత్ర పోషించారు. దస్తురాబాద్ మండలంలో 11,625 మంది ఓటర్లు ఉండగా 9,443 ఓట్లు పోలయ్యాయి. కాగా వీటిలో 5,177 ఓట్లు మహిళలవే ఉన్నాయి. కడం(పెద్దూరు) మండలంలో మొత్తం 29,159 మంది ఓటర్లు ఉండగా 23,285 మంది ఓటు వేశారు. కాగా ఇందులో 12,687 మంది మహిళా ఓటర్లున్నారు. ఖానాపూర్ రూరల్ మండలంలో మొత్తం 21,995 మంది ఓటర్లుంటే 17,441 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీరిలో మహిళా ఓటర్లు 9834 మంది ఉన్నా రు. ఇక లక్ష్మణచాంద మండలంలో మొత్తం 24,289 మంది ఓటర్లు ఉండగా 19708 ఓట్లు పోలయ్యాయి. కాగా వీరిలో 11,497 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మామడ మండలంలో 23,756 మంది ఓటర్లు ఉండగా 18,960 మంది ఓటు వేస్తే వీరిలో 10,879 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. పెంబి మండలంలో మొత్తం 9,806 మంది ఓటర్లుండగా 8,170 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 4,368 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం 86 శాతం మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా 74 శాతం మంది పురుషులు ఓటు వేశారు.

