మహిళా శ్రామిక శక్తి 37%కి పెరిగింది.. 'రోజ్‌గార్ మేళా'లో విద్యాశాఖ మంత్రి

 మహిళా శ్రామిక శక్తి 37%కి పెరిగింది.. 'రోజ్‌గార్ మేళా'లో విద్యాశాఖ మంత్రి

2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 37 శాతానికి పెరిగిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 'రోజ్‌గార్ మేళా'లో మాట్లాడిన ఆయన.. 2017-18లో ఈ సంఖ్య 23 శాతంగా ఉందన్నారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల సమాజంలో సమతుల్య వృద్ధి ఉందని ఆయన అన్నారు. దేశంలో చాలా చోట్ల పురుషుల కంటే ఎక్కువ కష్టపడి పనిచేసే మహిళలున్నారని అన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా కేంద్ర పథకాలు శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో దోహదపడ్డాయని ప్రధాన్ తెలిపారు. కేంద్రం విధాన రూపకల్పన, నాయకత్వ పాత్రల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా పని చేసే మహిళలకు రీ-స్కిల్లింగ్, అప్ స్కిలింగ్ ప్రాముఖ్యతను కూడా మంత్రి నొక్కి చెప్పారు. దేశంలో నిరుద్యోగిత రేటు 2017-18లో 6 శాతం నుంచి 2022-23లో 3.7 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు.