- సర్వసభ్య సమావేశంలో చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తే కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రతి మహిళకు కలగాలని కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో రాష్ట్ర మహిళా కమిషన్ నూతన కార్యవర్గం తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో చైర్‌పర్సన్‌తో పాటు కమిషన్ సభ్యులు, కార్యదర్శి, సెక్షన్ ఆఫీసర్లు, లీగల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తొలుత కమిషన్‌లో ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పరిష్కార ప్రక్రియపై చైర్‌పర్సన్ సమీక్ష నిర్వహించారు. ఏ జిల్లాల నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయో గుర్తించి, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను విజయలక్ష్మి ఆదేశించారు. వారానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు తప్పనిసరిగా కమిషన్ కార్యాలయానికి హాజరు కావాలన్నారు.
