వెటా ఆధ్వర్యంలో అమెరికాలో విమెన్స్ డే వేడుకలు

వెటా ఆధ్వర్యంలో అమెరికాలో విమెన్స్ డే వేడుకలు

 డల్లాస్: వెటా (ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ విమెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని డల్లాస్ సిటీ ఫ్రిస్కోలో ఉన్న ఇండిపెండెన్స్ హైస్కూల్​లో సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​గా ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ ప్రోటెం మేయర్ జోన్ కీటింగ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కేటగిరీల్లో అవార్డులను అందజేశారు. ఎమి జుచ్లెవ్స్కీ, అంబికా దద్వాల్, సురోమా సిన్హా, మెర్సీ స్ట్రిక్ ల్యాండ్​లు పురస్కారాలు అందుకున్నారు.

 ఈ కార్యక్రమానికి వీణా యలమంచిలి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ సుమంగళి, శ్రీకాంత్ లంక తమ పాటలతో ప్రేక్షకుల్లో హుషారును నింపారు. అనంతరం వెటా అధ్యక్షులు ఝాన్సీ రెడ్డి హనుమండ్ల  మాట్లాడారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 అనంతరం మహిళా శక్తిపై ప్రసంగించారు. ఈ కార్యక్రమం కోసం ఘనంగా ఏర్పాట్లు చేసిన వెటా డాలస్ ప్రెసిడెంట్  శైలజ  కల్లూరి, లోకల్ టీం సెక్రటరీ నవ్య స్మృతి రెడ్డి, ప్రతిమ రెడ్డి, వాలంటీర్లు గాయత్రి గిరి, మాధవి, ప్రశాంతి, జ్యోస్త్న, రేఖలకు వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల ధన్యవాధాలు తెలిపారు. కార్యక్రమంలో రత్నమాల  వంక, సునీత  గంప, విశ్వా  వేమిరెడ్డి కూడా పాల్గొన్నారు.