మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్, సీఎం కేసీఆర్

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్, సీఎం కేసీఆర్

వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మహిళలకు గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు చెప్పారు. జాతి నిర్మాణం, సమగ్రత, సామరస్యత, శాంతి పెంపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. మహిళలకు సహనం ఎక్కువని, అది వారికి దేవుడిచ్చిన వరమని ఆయన అన్నారు.

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి: సీఎం కేసీఆర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించిన సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళల స్వయం సాధికారిత దిశగా సమాజం పునరంకితం కావాలని సీఎం పిలుపునిచ్చారు.