పద్మారావునగర్,వెలుగు: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్సూచించారు. ఆదివారం తిరుమలగిరిలోని బంజారా నగర్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఉమెన్స్ బిజినెస్మేళాను ఆయన ప్రారంభించారు. మహిళలు తమ ఇంటి వద్ద తయారు చేసిన వంటలు, గృహోపకరణాలు, దుస్తులకు స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. ఎమ్మెల్యే వాటిని పరిశీలించి మాట్లాడారు. మహిళల వ్యాపారానికి కావాల్సిన బ్యాంకు లోన్లకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మేళా ఆర్గనైజర్లు యశోద, రీతూ, రచన, వేణుగోపాల్ రావు, నరసింహ, బోస్, కాంగ్రెస్ నాయకులు నాగినేని సరిత, మురళీ ముదిరాజ్ తదితరులున్నారు.
