విమెన్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌: సౌతాఫ్రికా టాప్‌‌ షో .. దుమ్ములేపిన బ్యాటర్లు.. పాక్ అట్టర్ ఫ్లాప్

విమెన్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌: సౌతాఫ్రికా టాప్‌‌ షో .. దుమ్ములేపిన బ్యాటర్లు.. పాక్ అట్టర్ ఫ్లాప్

కొలంబో: బ్యాటింగ్‌‌లో లారా వోల్‌‌వర్త్‌‌ (90), మారిజేన్‌ కాప్ (68 నాటౌట్‌‌), సునె లుస్‌‌ (61) దుమ్మురేపడంతో.. విమెన్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో సౌతాఫ్రికా ఐదో విజయాన్ని సాధించింది. ఛేజింగ్‌‌లో పాకిస్తాన్‌‌ను కట్టడి చేసి 150 రన్స్‌‌ (డక్‌‌వర్త్‌‌ లూయిస్‌‌) తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 10 పాయింట్లతో సఫారీ జట్టు టాప్‌‌లోకి దూసుకొచ్చింది. 

వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌‌ను 40 ఓవర్లకు కుదించారు. దాంతో టాస్‌‌ ఓడిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 312/9 స్కోరు చేసింది. తజ్మిన్‌‌ బ్రిట్స్‌‌ (0) విఫలమైనా.. వోల్‌‌వర్త్‌‌ చెలరేగింది. లుస్‌‌తో రెండో వికెట్‌‌కు 118, కాప్‌‌తో మూడో వికెట్‌‌కు 64 రన్స్‌‌ జోడించింది. మధ్యలో డెరెక్‌‌సన్‌‌ (9), కరాబో మెసో (0) నిరాశపర్చినా.. కాప్‌‌, చోలే ట్రయాన్‌‌ (21), డి క్లెర్క్‌‌ (41) మధ్య 93 రన్స్‌‌ జతయ్యాయి. 

సాదయా ఇక్బాల్‌‌, నషారా సంధు చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత వాన పడటంతో పాక్‌‌ టార్గెట్‌‌ను 20 ఓవర్లలో 234 రన్స్‌‌గా నిర్దేశించారు. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌‌ 83/7 స్కోరుకే పరిమితమైంది. సిద్రా నవాజ్‌‌ (22 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. నటాలియా పెర్వియాజ్‌‌ (20) మోస్తరుగా ఆడినా మిగతా వారు తేలిపోయారు. కాప్‌‌ 3, నోండుమిసో షాంగాసే 2 వికెట్లు పడగొట్టింది. కాప్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.