విమెన్స్‌‌‌‌ వరల్డ్‌ కప్: కింగ్‌‌‌‌ హిట్ 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఆసీస్ గెలుపు

విమెన్స్‌‌‌‌ వరల్డ్‌ కప్: కింగ్‌‌‌‌ హిట్ 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఆసీస్ గెలుపు

ఇండోర్‌‌‌‌: లెగ్ స్పిన్నర్‌‌‌‌ అలనా కింగ్‌‌‌‌ (7/18) సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేయడంతో.. విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ లీగ్‌‌‌‌ దశను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో బెత్‌‌‌‌ మూనీ (42), జార్జియా వోల్‌‌‌‌ (38 నాటౌట్‌‌‌‌) నిలకడగా ఆడటంతో.. శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. టాస్ ఓడిన సౌతాఫ్రికా 24 ఓవర్లలో 97 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. కెప్టెన్‌‌‌‌ లారా వోల్‌‌‌‌వర్త్‌‌‌‌ (31) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. సినాలో జాఫ్తా (29), డి క్లెర్క్‌‌‌‌ (14) పోరాడి విఫలమయ్యారు. 

ఆరంభంలో మేఘన్‌‌‌‌ షుట్‌‌‌‌ (1/21), కిమ్‌‌‌‌ గార్త్‌‌‌‌ (1/21) దెబ్బకు వోల్‌‌‌‌వర్త్‌‌‌‌, తజ్మిన్‌‌‌‌ బ్రిట్స్‌‌‌‌ (6) ఔట్‌‌‌‌కాగా, మిడిలార్డర్​ను అలనా కింగ్‌‌‌‌ షేక్‌‌‌‌ చేసింది. కేవలం ఏడు ఓవర్లలో ఏడు వికెట్లు తీసింది. విమెన్స్‌‌‌‌ వన్డేల్లో బెస్ట్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ను చూపెట్టడంతో పాటు మెగా కప్‌‌‌‌లో అత్యుత్తమ బౌలింగ్‌‌‌‌ గణాంకాలు నమోదు చేసింది. 

తర్వాత ఛేజింగ్‌‌‌‌లో ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలో 98/3 స్కోరు చేసి నెగ్గింది. లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ (5), ఎలైస్‌‌‌‌ పెర్రీ (0) నిరాశపర్చినా.. సదర్లాండ్‌‌‌‌ (10 నాటౌట్‌‌‌‌) ఫర్వాలేదనిపించింది. కింగ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.  సెమీస్​లో ఇంగ్లండ్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సౌతాఫ్రికాతో, ఇండియా.. ఆస్ట్రేలియాతో తలపడతాయి.