బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు చేసిన పనులపై రివ్యూ చేయాలి: బీర్ల అయిలయ్య

బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు చేసిన  పనులపై రివ్యూ చేయాలి: బీర్ల అయిలయ్య
  • అవసరమైతే రద్దు చేయాలి
  • జెడ్పీ మీటింగ్​లో ప్రభుత్వ విప్​ 
  • బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం

యాదాద్రి, వెలుగు: ఎన్నికల్లో లబ్ది పొందడానికి  హడావుడిగా సీడీపీ, స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్స్​ కింద  ఇచ్చిన ప్రొసిడింగ్స్​పై రివ్యూ చేయాలని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి సూచించారు. యాదాద్రి జడ్పీ చైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి అధ్యక్షతన మంగళవారం  జడ్పీ మీటింగ్​ నిర్వహించారు. 

కులానికో బిల్డింగ్​ మంజూరు చేస్తున్నామని చెప్పి ప్రొసిడింగ్స్​ అందించారని , శాంక్షన్​, ఫండ్స్​ లేకున్నా ప్రొసిడింగ్స్​ ఇచ్చినట్టయితే  రద్దు చేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్​, పంచాయతీరాజ్​ డిపార్ట్​మెంట్లను విభజించడం వల్ల పనులు ముందుకు జరగడం లేదని పలువురు మెంబర్లు తెలిపారు. ఈ రెండు డిపార్ట్​మెంట్లను జిల్లా యూనిట్​గా విధులు నిర్వహించేలా తీర్మానం చేయాలని సూచించారు. 

యాదాద్రిని నెంబర్​వన్​ చేస్తం- బీర్ల అయిలయ్య

అభివృద్ధిలో యాదాద్రి జిల్లాను నెంబర్​వన్​గా నిలబెడతామని ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య తెలిపారు. డెవలప్మెంట్​ విషయంలో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా ముందుకు సాగుదామని సూచించారు. సమస్యలు ఉంటే దృష్టికి తీసుకొని రావాలని కోరారు. భువనగిరి నియోజకవర్గంలో కాలువల పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు. 

ఎలాంటి ఇబ్బందులు కలిగినా తనను సంప్రదించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేలను మెంబర్లు సన్మానించారు. జడ్పీ మీటింగ్​లో కలెక్టర్​ హనుమంతు జెండగే, అడిషనల్​ కలెక్టర్​ జీ వీరారెడ్డి, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, కాంగ్రెస్​ ఫ్లోర్​ లీడర్​ డాక్టర్​ కే నగేశ్​ ఉన్నారు.