మార్చి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

మార్చి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్
  •                 బడా కంపెనీల నిర్ణయం
  •                 గూగుల్ ఎంప్లాయిస్ జులై వరకు ఇంటి నుంచే..
  •                 డైలమాలో చిన్న కంపెనీలు
  •                 పరిస్థితులను బట్టి పొడిగించే ఆలోచన

 

లాక్ డౌన్​తో సిటీలో క్లోజ్​అయిన ఐటీ కంపెనీలు ఇప్పట్లో ఓపెన్​అయ్యేట్టు కనిపించడం లేదు. ఇంకొన్ని నెలలపాటు ఎంప్లాయిస్ తో వర్క్​ ఫ్రమ్ ​హోమ్​ చేయించేందుకే మేనేజ్​మెంట్స్​డిసైడ్​ అయ్యాయి. గూగుల్ వచ్చే ఏడాది జూలై వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించగా, సిటీలోని బడా కంపెనీలు మార్చి వరకు ఇంటి నుంచే వర్క్ చేయాలని తమ ఎంప్లాయిస్ కి చెప్పేశాయి. చిన్న కంపెనీల్లో డైలమా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఈ ఇయర్​ ఎండ్​వరకు అనుకున్నా, పరిస్థితులను బట్టి పొడిగించాలని ఆలోచిస్తున్నాయి.

వచ్చే ఏడాది వరకు..

కరోనాతో మార్చిలోనే సిటీలోని ఐటీ కంపెనీ లు క్లోజ్​ అయ్యాయి. కేసుల తగ్గేదాన్ని బట్టి సెప్టెంబర్​లో ఓపెన్ చేయాలని కొన్ని నిర్ణయం తీసుకున్నా, డిసెంబర్ దాకా పొడిగించాయి. అదికాస్తా ఇప్పుడు నెక్స్ట్​ఇయర్​ వరకూ వెళ్లింది. జెన్ పాక్ట్, టెక్ మహీంద్రా వంటి బడా కంపెనీలు వచ్చే ఏడాది మార్చి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. ఓరాకిల్, కాగ్నిజెంట్, ఓటీఎం ల్యాబ్స్ వంటివి డిసెంబర్ వరకు అని ఇప్పటికే చెప్పినా, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పై హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రెన్యూరర్స్ అసోసియేషన్ (హైసియా) ఇటీవల ఓ సర్వే చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటం వల్లే ఎంప్లాయిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి మొగ్గు చూపుతున్నట్లు అందులో తేలింది. 95శాతం ఐటీ కంపెనీలు పూర్తిస్థాయిలో ఎంప్లాయిస్ తో వర్క్​చేయించుకుంటున్నాయని ఆ రిపోర్ట్​పేర్కొంది. గత రెండు నెలల్లో ఇంటి నుంచి పని చేస్తున్న వారి సంఖ్య పెరిగిందని స్పష్టం చేసింది.

వైరస్ భయంతో..

ఆఫీస్​ రీఓపెన్ చేస్తే గ్యాదెరింగ్, మీటింగ్ లతో వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని మేనేజ్​మెంట్లు భావిస్తున్నాయి. ఎంఎన్​సీలకు ప్రాజెక్ట్ లు ఇచ్చే దాదాపు 10శాతం కంపెనీలు రీ ఓపెన్ చేయాలని అడుగుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇబ్బందుల్లేకపోవడం, ఎంప్లాయిస్ నుంచి ఇన్ టైంలో రిజల్ట్ ఉంటుండటం, ఉద్యోగులు కూడా ఇంటి నుంచి వర్క్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో పొడగించాయి.

అఫీషియల్​గా చెప్పలే..

నేను ఒరాకిల్​లో వర్క్ చేస్తున్నా. డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చని మా టీం లీడర్ చెప్పారు. ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు కొన్ని డిసెంబర్, మరికొన్ని మార్చి దాకా అనౌన్స్​ చేశారు.  ప్రజెంట్ సిట్యువేషన్ లో మా పేరెంట్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నే ప్రిఫర్ చేస్తున్నారు. ఇంట్లో అయితే సేఫ్ అండ్ సెక్యూర్ అని భావిస్తున్నారు.

  -ఆఫ్రిన్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్

డిసెంబర్ వరకు అని..

వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైనప్పటి నుంచి ఐటీ మినిస్ట్రీ నుంచి వచ్చిన మెయిల్స్ నే ఫార్వర్డ్ చేశారు. ప్రాజెక్ట్ చెప్పిన టైంలో ఫినిష్ చేస్తున్నాం. ఎక్కడున్నా వర్క్ అవుతుంది కాబట్టి మా కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్ టెండ్ చేస్తోంది. డిసెంబర్ వరకు ఉండొచ్చని అనుకుంటున్నాం.
– ప్రవీణ్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్​