Health Tips : పని ఒత్తిడి .. గుండె కు ప్రమాదం.. ఇలా తప్పించుకోండి..!

 Health Tips :   పని ఒత్తిడి .. గుండె కు ప్రమాదం.. ఇలా తప్పించుకోండి..!

ప్రస్తుతం జనాలు  చిన్నపనికి.. పెద్ద పనికి  ఒత్తిడి.. టెన్షన్​ కు గురవుతున్నారు.  దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.  ఓ పక్క కోప్ పెరగడం.. గుండె ఒత్తిడి కలగడం లాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఒత్తిడిని అదుపులో పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు. దానికోసం  కొన్ని మెళకువలు తెలుసుకోండి. . 

ఆధునిక జీవనంలో ఒత్తిడి సహజం. ఆఫీసుల్లో టార్గెట్లు, ఇంట్లో సమస్యలు చాలామందిలో ఒత్తిడికి కారణం అవుతున్నాయి. బాస్ ప్రవర్తన, నిర్వహణ శైలి, పని ఒత్తిడి, సహచరుల మధ్య పోటీ వంటి వాటితో ఉద్యోగం కోల్పోతామేమోనన్న ఆందోళన. ఉద్యోగుల్లో పెరుగుతోంది. దాంతో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగానికి సంబంధించిన ఆందోళనతో 20% గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. దీన్నిబట్టి ఒత్తిడి గుండె సమస్యలకు దారి తీస్తుందనేచెప్పాలి. అయితే దీనికి ఆందోళన చెందాల్సినక్కర్లేదు. 

  • ప్రతి విషయాన్ని పాజిటివ్ గా  ఆలోచించండి. 
  • ప్రతీదాన్ని సమస్యగా చూస్తే ఫలితం కూడా సమస్యాత్మకంగానే ఉంటుంది. 
  •  ఆలోచనల్లో నెగెటివ్ కోణానికి ఆస్కారం లేకుండా చూసుకోండి. 
  •  ఒత్తిడితో విలువైన జీవితం కోల్పోయే ప్రమాదం ఉంది.  ఒత్తిడి శరీరంలో అత్యవసర పరిస్థితిని సృష్టిస్తుంది. ఒత్తిడి  ఒత్తిడి  వలన అంతర్గత అవయవాలు వాపునకు గురయ్యే ప్రమాదం ఉంది.