
కరోనా..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. వస్తువుల ఉత్పత్తులు లేక, పలు సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్ ఇలా అన్ని వ్యాపారాలకు ఆటంకం కలగడంతో ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ కూడా ఇచ్చాయి. కానీ నిత్యావసర ధరలు, ఇతర ఇబ్బందుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో అమెరికాకు చెందిన వర్క్ డే అనే ఫైనాన్షియల్ సంస్థ తమ ఉద్యోగులకు రెండు వారాల జీతాన్ని బోనస్ ను నగదుగా ఇస్తామని ప్రకటించి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపింది. బోనస్ కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. అంతేగాకుండా ఉద్యోగులకు వేతనంతో కూడిన సిక్ లీవ్ గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 లోపు బోనస్ చెల్లించాలని భావిస్తుంది. అయితే ఈ ఆఫర్ ఎగ్జ్ క్యూటివ్ ఉద్యోగులకు తప్ప మిగతా ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ ఉద్యోగులకు అండగా ఉండటం కోసమే ఈ నిర్ణయమని ఒక బ్లాగ్ లో తెలిపింది.