
సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ పై కప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం 66 లెవెల్‌లో 41 డీప్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని నవీన్ అనే కార్మికుడు చనిపోయాడు. మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది.