కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి
  • ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించండి 
  • మంత్రి శ్రీధర్ బాబుకుఐఎన్ టీయూసీ నేతల విజ్ఞప్తి

బషీర్ బాగ్, వెలుగు: కార్మికుల సమస్యలపై ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి  దేవసాని భిక్షపతి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ట్రేడ్ యూనియన్ లీడర్ జనక్ ప్రసాద్ లు మంగళవారం గాంధీభవన్ లో కలిసి  వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో 73 కార్మికరంగాల్లోని 1 కోటి 7 లక్షల మంది  కార్మికుల కనీస వేతనాలపై 12 ఏండ్లుగా రివిజన్ చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నిత్యావసరాల ధరలు 200 శాతం,  ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్యం  ఖర్చులు 150 శాతం పెరిగాయని తెలిపారు. 

కానీ.. కార్మికుల జీతాలు పెరగకపోవడంతో  కొనుగోలు శక్తి తగ్గి కుటుంబాలను పోషించుకోలేక అప్పులపాలై దుర్భరస్థితిలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లి  రాష్ట్రంలోని 1 కోటి 7 లక్షల మంది  అసంఘటిత రంగ కార్మికులు న్యాయబద్ధమైన వేతనాలను పొందేందుకు కృషి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.