ఇంటి దారి పట్టిన వలస కూలీలు

ఇంటి దారి పట్టిన వలస కూలీలు

ఏన్కూరు, వెలుగు : వాళ్లంతా పొట్టకూటి కోసం గ్రామాలు దాటి వచ్చారు. నెలల తరబడి పొలాల్లోనే గడిపారు. మిర్చి, సుబాబుల్​ పనులు పూర్తి కావడంతో వారంతా తిరిగి ఇంటిదారి పడుతున్నారు. ఒడిశా, చత్తీస్​గఢ్‌, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ప్రతీ ఏటా ఏన్కూరు మండలానికి 6 నుంచి 7వేల మంది కూలీలు వస్తారు. ఇక్కడ వలస కూలీలు ప్రధానంగా మిర్చి, సుబాబుల్​ కోత కోయడానికి వస్తారు. జిల్లాలోనే మిర్చి సాగులో ఏన్కూరు మండలం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక్కడ మిర్చి కోత కోయడానికి కూలీలు చాలా మంది అవసరం.

మన కూలీల కన్నా ఇక్కడి రైతులు వలస కూలీలపైనే అధార పడతారు. వలస కూలీలకు వారి స్వగ్రామాల్లో కూలీకి వెళ్తే రోజుకి రూ.150 నుంచి రూ.200 కూలీ వస్తుంది . అదే ఇక్కడ రూ.450 నుంచి రూ.550 వరకు కూలీ గిట్టు బాటు అవుతుంది. వలస కూలీలకు ఇక్కడ రైతులు పొలంలోనే వసతి ఏర్పాటు చేస్తారు. పనులు పూర్తి కావడంతో కూలీలు తిరిగి ఇంటి దారి పట్టారు.