కార్మికులు వేతనాలపై లేబర్ కోర్టుకు వెళ్లాలి: ఏజీ

కార్మికులు వేతనాలపై లేబర్ కోర్టుకు వెళ్లాలి: ఏజీ

ఆర్టీసీ కార్మికుల వేతనాల చెల్లింపుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసి కార్మికులు సాలరీలు చెల్లించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టుకు తన వాదనలు విన్పించారు ఏజీ. వేతన చట్టం ప్రకారం వేతన మినహాయింపు చేసే అధికారం ఆర్టీసీ యాజమాన్యానికి ఉందని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఒక్కరోజు గైహాజరైనా 8రోజుల వేతనం మినహాయించే అధికారం కూడా ఆర్టీసీకి ఉందన్నారు. చేసిన పనికి వేతనం చెల్లించాలని కోరుతున్నామని కార్మిక సంఘాల తరపు న్యాయవాది కోర్టును కోరారు. పని చేసిన సెప్టెంబర్‌ నెల వేతనాలు చెల్లించకపోవటం చట్టవిరుద్ధమని అన్నారు. సమ్మె కారణంగా వేతనాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.

అయితే కార్మికులు వేతనాలపై లేబర్ కోర్టుకు వెళ్లాలని.. హైకోర్టుకు కాదని అదనపు ఏజి సూచించారు.ఇరు వాదనలు విన్న హైకోర్టు తర్వాత విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.