విజయ్‌‌‌‌తో వర్క్ చేయడం వండర్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ : నాగార్జున

విజయ్‌‌‌‌తో వర్క్ చేయడం వండర్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ :  నాగార్జున

నాగార్జున, అల్లరి నరేష్ హీరోలుగా విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన చిత్రం ‘నా సామిరంగ’. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని, దర్శకుడిగానూ సక్సెస్ అయిన సందర్భంగా తెలుగు ఫిల్మ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కంగ్రాట్స్ మీట్‌‌‌‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నాగార్జున మాట్లాడుతూ ‘విజయ్‌‌‌‌తో వర్క్ చేయడం వండర్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్. డైరెక్షన్ కొత్త అయినా.. చాలా ఫాస్ట్‌‌‌‌గా మూవీ కంప్లీట్ చేశాడు.  సినిమాని ఒక పాటలా చాలా అందంగా తీసి కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు.  డ్యాన్సర్స్ అసోసియేషన్ నిర్వహించిన  ఈ వేడుకకు రావడం గౌరవంగా భావిస్తున్నా. ప్రతి ఒక్కరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. 

‘విజయ్ రచ్చ గెలిచి, ఇంట గెలిచాడు. డైరెక్టర్ కావాలనే తన కలను సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా నెరవేర్చుకున్నాడు’ అని అన్నాడు అల్లరి నరేష్. విజయ్ బిన్ని మాట్లాడుతూ ‘నాగార్జున గారు నన్ను దర్శకుడిగా సెలెక్ట్ చేసుకోవడం నా అదృష్టం.  ఆయన ఇచ్చిన ప్రేమను మర్చిపోలేను.  నేను దర్శకుడిగా మరో సినిమా చేయబోతున్నా. అందులో మరో కొత్త కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌ని పరిచయం చేయబోతున్నా’ అని చెప్పాడు. డ్యాన్స్ మాస్టర్స్ శేఖర్, అజయ్, సుజాత, శివాజీ సహా  డ్యాన్సర్స్  అసోసియేషన్ సభ్యులంతా పాల్గొన్నారు.