పని ప్రాంతాల్లో మహిళలపై వేధింపులను అరికట్టాలి : అంజనీకుమార్

పని ప్రాంతాల్లో మహిళలపై వేధింపులను అరికట్టాలి : అంజనీకుమార్
  •     డీజీపీ అంజనీకుమార్
  •     పోష్ యాక్ట్ పై విమన్ సేఫ్టీ వింగ్ వర్క్ షాప్

హైదరాబాద్‌‌, వెలుగు : వర్క్‌‌ ప్లేస్‌‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని, పని ప్రాంతాల్లో మహిళలకు అవగాహన కలిగించాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. పోష్‌‌ యాక్ట్‌‌–2013(ప్రివెన్షన్‌‌ ఆఫ్‌‌ సెక్సువల్‌‌ హరాస్‌‌మెంట్‌‌ ఎట్‌‌ వర్క్‌‌ప్లేస్‌‌)పై గురువారం డీజీపీ ఆఫీసులో వర్క్‌‌ షాప్‌‌ నిర్వహించారు. విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయల్ ఆధ్వర్యంలో ఫస్ట్‌‌ స్టేట్‌‌ లెవెల్‌‌ వర్క్‌‌ షాప్ జరిగింది.  కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 54 పోలీస్ యూనిట్స్‌‌ నుంచి 108 మంది ఇంటర్నల్ కమిటీ మెంబర్స్‌‌ పాల్గొన్నారు. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయి..

వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు,చట్టాలను వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. సిబ్బందికి పోష్‌‌ యాక్ట్‌‌ నిబంధనలపై అవగాహన ఉండాలని సూచించారు. న్యాయసూత్రాలను అనుసరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్క్‌‌ ప్లేసెస్‌‌లో మహిళలకు గౌరవం, పురుషులతో సమానత్వం, భద్రత గురించి అవగాహన కల్పించాలన్నారు. వేధింపులకు పాల్పడేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.