ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాథా ఖడకే

ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాథా ఖడకే

గ్వాంగ్జౌ (సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరియా): ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాథా ఖడకే.. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 666 పాయింట్లు సాధించిన గాథా తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7–1 (26–26, 27–25, 27–26, 28–24)తో ఫాతిమా హుసేనీ (అజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బైజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై నెగ్గింది. తర్వాతి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6–0 (28–27, 27–26, 29–28)తో థియా రోజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను చిత్తు చేసింది. అయితే మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాథాకు అసలు పరీక్ష ఎదురైంది.

 అయినప్పటికీ 6–4తో ఒలింపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. ఓ దశలో ఇద్దరు ఆర్చర్లు 4–4తో సమంగా నిలిచారు. కానీ గురి తప్పకుండా బాణాలు వేసిన గాథా డిసైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10, 9, 9తో 28 పాయింట్లు నెగ్గగా, జర్మన్ ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 పాయింట్లు సాధించలేకపోయింది. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీపికా కుమారి తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే డయానందా చోయిరునిసా (ఇండోనేసియా) చేతిలో ఓడింది.