ఉగ్రవాదానికి సహకరించే దేశాలపై ఉక్కుపాదం మోపాలి

ఉగ్రవాదానికి సహకరించే దేశాలపై ఉక్కుపాదం మోపాలి

ఉగ్రవాదానికి సహకరించే, ప్రోత్సాహం అందించే దేశాలపై ఉక్కుపాదం మోపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సదరు దేశాలను వేరు చేసేందుకు అన్ని దేశాలు కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సమావేశం నిర్వహించాలన్న భారత్ ప్రతిపాదనను పరిశీలించాలని యునైటెడ్ నేషన్స్‌‌ను వెంకయ్య కోరారు. టెర్రరిజం నుంచి ఏ దేశం కూడా సురక్షితంగా లేదని తెలిపారు. టెర్రరిజానికి సహకరిస్తున్న దేశాల పై గంభీరమైన ప్రకటనలకు కాలం చెల్లిందని.. వాటిపై శక్తిమంతమైన చర్యలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఐక్యరాజ్య సమితిలోనూ కీలక సంస్కరణలు తీసుకొచ్చి.. సమానమైన, శ్రేష్ఠమైన ప్రపంచ క్రమాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు.